Singer · Cultural ambassador · Author · Philanthropist
Mrs. Sarada Akunuri – A Passionate Torchbearer of Music, Literature, and Telugu Culture
శ్రీమతి శారద ఆకునూరి – సంగీతం, సాహిత్యం, తెలుగు సంస్కృతికి అంకితమైన ధ్వజవాహిక
Renowned singer Mrs. Sarada Akunuri is admired for her deep passion for songs enriched with noble literary values. Born in Kakinada, East Godavari District, to Mr. Mrutyunjaya Rao and Mrs. Ramadevi, she pursued her education in Bapatla (Guntur District) and Tirupati (Chittoor District).
Sarada began learning music at the tender age of three. From childhood, she won numerous state-level awards in devotional, light music, and film song competitions. She also earned recognition in essay writing and dance competitions, receiving appreciation from several eminent personalities.
ఉదాత్త సాహిత్యంతో సృష్టించిన గీతాలంటే ఎంతో అభిమానం, ఇంకా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే “PASSION” ఉన్న ప్రముఖ గాయని శ్రీమతి శారద ఆకునూరి. శ్రీ మృత్యుంజయరావు, శ్రీమతి రమాదేవి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన శారద ఆకునూరి, గుంటూరు జిల్లా బాపట్లలోనూ మరియు చిత్తూరు జిల్లా తిరుపతిలోనూ విద్యనభ్యసించారు.
మూడేళ్ళ లేలేత ప్రాయంలోనే పాటలు పాడటం అభ్యసించిన వీరు భక్తి, లలిత, సినిమా పాటల పోటీలలో అనేక మార్లు రాష్ట్రస్థాయి బహుమతులను గెలుచుకున్నారు. వ్యాసరచన మరియు నృత్య పోటీల్లో పాల్గొని పలువురి ప్రముఖుల ప్రశంసలందుకొన్నారు.
She started her singing career through the Yuvavani program of All India Radio, Vijayawada, rendering light classical and light music compositions. Within a short period, she successfully cleared the All India Radio audition and became an approved radio artist, performing numerous light music programs. In addition, she played lead roles in several Yuvavani radio dramas centered on themes such as friendship and literacy. Her melodious voice captivated radio listeners as well as television audiences through programs such as ETV’s Sarigamalu, where she won first prize in film song and movie quiz competitions, and Gemini TV’s Navaragam.
As a television presenter, she hosted Tele School educational programs and women’s programs for Doordarshan Hyderabad. She interviewed many distinguished personalities, including film actors Jagapathi Babu, music directors K. M. Radha Krishnan, Raja, Koti, and several leading industrialists, bringing out their personal insights through her thoughtful interviews. She also earned immense popularity as a City Cable News reader, game show host, and television anchor.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు ఆలపించి అతికొద్ది కాలంలోనే రేడియో ఆడిషన్లో కృతార్థురాలై రేడియో గాయనిగా అనేక లలిత గీతాలు ఆలపించారు. ఇవేకాక స్నేహం, అక్షరాస్యత మీద అనేక యువవాణి రేడియో నాటికలలో ప్రధాన పాత్ర పోషించారు. తన గాత్రంతో ఆకాశవాణి శ్రోతలతో పాటు టీవీ ప్రేక్షకులను కూడా ఈ టీవీ వారి సరిగమలు సినిమా పాటలు, సినిమాల క్విజ్‌లో ప్రథమస్థానం, జెమినీ టీవీ వారి నవరాగంలో పాల్గొని అలరించారు.
హైదరాబాద్ దూరదర్శన్‌లో టెలీ స్కూల్ కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలతో పాటు పలు సినీ ప్రముఖులు, జగపతిబాబు, KM రాధాకృష్ణన్, రాజా, కోటి గారు వంటి వారిని, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఇంటర్వ్యూ చేసి తన ప్రశ్నావళి ద్వారా ప్రముఖుల అంతరంగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సిటీ కేబుల్ న్యూస్ రీడర్‌గా, గేమ్ షో హోస్ట్‌గా, యాంకర్‌గా ప్రేక్షకాభిమానాన్ని పొందారు.
After her marriage, Sarada moved to the United States and won first place in the Houston Talent Star Search competition. Driven by her love for the Telugu language and culture, she actively worked to preserve and promote them among the Telugu diaspora. She served as the Cultural Secretary of the Telugu Cultural Association (TCA), Houston, and later as its President for two consecutive years.
During her leadership, she organized numerous landmark cultural programs reflecting the richness of Indian heritage, including Sankranti and Ugadi celebrations, Vaggeyakarotsavam, Siddhendra Yogi Jayanthi, family picnics, immigration seminars, and the memorable cultural extravaganza “Taralu Digi Vachina Vela”, featuring legendary personalities such as K. Viswanath, Murali Mohan, Gollapudi Maruthi Rao, Jonnavithula Ramalingeswara Rao, and comedian AVS.
She also organized a grand concert by the legendary Dr. M. Balamuralikrishna, invited and felicitated Dadasaheb Phalke Award recipient Akkineni Nageswara Rao, conducted music workshops with Guru Ramachary, helped develop the Telugu language curriculum for Telugu Badi, and published the 35th Anniversary Souvenir “Madhuravani” for TCA.
వివాహానంతరం అమెరికాలో అడుగుపెట్టి, Houston టాలెంట్ స్టార్ సెర్చ్‌లో ప్రథమ స్థానం పొంది విజేతగా నిలిచారు. తెలుగు భాష సంస్కృతి మీద మక్కువతో అక్కడ కూడా పరిరక్షించాలి, పెంపొందించాలి అనే సదుద్దేశంతో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితిలో సాంస్కృతిక కార్యదర్శిగా చేసి, తర్వాత రెండు సంవత్సరముల పాటు అధ్యక్షురాలిగా పనిచేసారు.
ఆ నేపథ్యంలో మన సంస్కృతికి అద్దంపట్టే పండుగలు సంక్రాంతి, ఉగాది వంటి పండుగలతో పాటు వాగ్గేయకారోత్సవం, సిద్ధేంద్రయోగి జయంతోత్సవం, వనభోజనాలు, ఇమ్మిగ్రేషన్ సెమినార్ వంటి ఎన్నో కార్యక్రమాలతో పాటు సినీ దిగ్గజాలు కళాతపస్వి శ్రీ కె. విశ్వనాధ్, శ్రీ మురళి మోహన్, శ్రీ గొల్లపూడి మారుతీరావు, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, హాస్య నటులు AVS తదితరులు పాల్గొన్న అపురూప సాంస్కృతిక కార్యక్రమం “తారలు దిగి వచ్చిన వేళ”, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సంగీత కచేరి, దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అందరి అభిమాన నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆహ్వానించి సత్కరించడం, గురువు రామాచారి గారితో సంగీత శిక్షణ వర్క్‌షాప్స్, తెలుగుబడి పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయడం, మధురవాణి పత్రికను TCA 35వ వార్షికోత్సవ సంచికగా ప్రచురించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు.
Mrs. Akunuri also served as a teacher at the Vedic Heritage School of the Meenakshi Temple, teaching the Ramayana, Mahabharata, and Bhagavatam. As a Radio Jockey on Houston Telugu Radio, she entertains listeners every Saturday with classic Telugu melodies, riddles, quizzes, and interactive games. She was the first to introduce singing competitions on American Telugu radio.
Her organizational leadership extends to serving as Cultural Chair for the 19th TANA Convention, Cultural Secretary for NATA Conferences, Cultural Secretary for TANA Chaitanya Sravanthi, organizing language and cultural service activities across Andhra Pradesh, Advisor for music competitions at the 20th TANA Convention, and Cultural Chair for the 2019 American Telangana Association Convention.
మీనాక్షి దేవస్థానం వారి VEDIC HERITAGE SCHOOL లో రామాయణం, భారతం, భాగవతం బోధించే అధ్యాపకురాలిగా పనిచేసారు. హ్యూస్టన్ తెలుగు రేడియోలో రేడియో జాకీగా శ్రోతలకు అలనాటి మధురగీతాలను వినిపిస్తూ మెదడుకు పదును పెట్టే పొడుపుకథలతో రకరకాల ఆటలతో ప్రతి శనివారం అలరిస్తారు. అమెరికా రేడియోలో మొట్టమొదటి సారిగా పాటల పోటీలు నిర్వహించి భళా అనిపించుకున్నారు.
19వ TANA ద్వైవార్షిక సభలకు కల్చరల్ చైర్‌గా, NATA మహాసభల్లో సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించారు. TANA చైతన్య స్రవంతికి సాంస్కృతిక కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాలలో భాష, సంస్కృతి సేవ పరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 20వ TANA మహాసభల్లో దీంతానా అడ్వైసర్‌గా ఉండి సంగీత పోటీలు నిర్వహించారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ ద్వైవార్షిక మహాసభలకు 2019 లో కల్చరల్ చైర్‌గా పని చేశారు.
Despite living in the United States, Sarada has continued her musical journey with unwavering dedication. She has performed in hundreds of concerts across the United States, Canada, and India in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam. She has shared the stage with legendary playback singers including P. Susheela, Koka Jamuna Rani, Ramakrishna, SP Sailaja, Mano, Ghantasala Ratna Kumar, Mallikarjun, Srikrishna, and Hemachandra, earning immense admiration from music lovers.
అమెరికాలో ఉంటూ కూడా తనకు పాటల పట్ల ఉన్న మక్కువతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో, అమెరికాలో ఉన్న అన్ని నగరాల్లో, కెనడాలో, ఇండియాలో వందలాది విభావరుల్లో పాల్గొన్నారు. P. సుశీల, కోకా జమునారాణి, రామకృష్ణ, మనో, ఘంటసాల రత్నకుమార్, మల్లికార్జున్, శ్రీకృష్ణ, హేమచంద్ర వంటి ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులతో గొంతు కలిపి ఎన్నో సంగీత విభావరులు చేసి సంగీత ప్రియుల ప్రశంసలు అందుకున్నారు.
In recognition of her contributions, Telugu Times, one of America’s most popular Telugu publications, featured her among the Nine Most Prominent Telugu Personalities in America during its 9th Anniversary celebrations.
She received the “Commitment and Contribution to the Empowerment of Women” Award at the International Women’s Celebrations in Dallas, presented alongside the legendary P. Susheela. On the occasion of Akkineni Nageswara Rao’s 89th birthday, she received the TANA Community Service Award from the hands of Akkineni Nageswara Rao himself.
She has been the principal singer in several prestigious musical tributes, including celebrations honoring ANR’s 90th Birthday, SP Balasubrahmanyam’s Pendyala Award, Jamuna’s Adurthi Award, Kota Srinivasa Rao’s Allu Ramalingaiah Award, Ali’s Lifetime Achievement Award, Pride of Indian Cinema Award presented to Director Singeetam Srinivasa Rao, Veturi Geethanjali, Dasari Swarabhishekam, Rajan–Nagendra Musical Tribute, and full-length musical tributes dedicated to legendary music directors Satyam, Ramesh Naidu, K. V. Mahadevan, and lyricists Daasarathi, C. Narayana Reddy (Cinaare), and Veturi.
In 2014, she received the prestigious Vamsi Ugadi Award alongside music directors Mani Sharma and Koti. She also performed in Chennai before the legendary music director M. S. Viswanathan, receiving an award from him at a musical program organized by the Andhra Cultural Club.
అమెరికాలో బహుళ ప్రజాదరణ పొందిన తెలుగు టైమ్స్ పత్రిక 9వ వార్షికోత్సవం సందర్భంగా, అమెరికాలో 9 మంది ప్రముఖుల జాబితాలో వీరు ఉండటం విశేషం.
డల్లాస్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సంబరాల్లో “Commitment and Contribution to the Empowerment of Women” పురస్కారాన్ని మధుర గాయని P. సుశీలగారితో, అక్కినేని గారి 89వ పుట్టిన రోజు సందర్భంగా TANA కమ్యూనిటీ సర్వీస్ పురస్కారాన్ని శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా అందుకున్నారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ ANR గారి 90వ పుట్టినరోజు, పద్మశ్రీ SP బాలు గారికి పెండ్యాల పురస్కారం, అందాల నటి జమున గారికి ఆదుర్తి పురస్కారం, ప్రముఖ నటులు కోట శ్రీనివాస్ రావు గారికి అల్లు రామలింగయ్య పురస్కారం, కమెడియన్ అలీకి Lifetime Achievement పురస్కారం, సేఫ్ NGO వారి వేటూరి గీతాంజలి, దర్శకరత్న దాసరి స్వరాభిషేకం, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ రాజన్ గారి సమక్షంలో జరిగిన రాజన్ – నాగేంద్ర సినీగీత వైభవం, స్వర్ణయుగ సంగీత దర్శకులు సత్యం, రమేష్ నాయుడు, మహదేవన్, ప్రముఖ గీత రచయితలు దాశరధి, సినారె, వేటూరి వంటి వారికి పూర్తిస్థాయి ప్రతిష్టాత్మక సంగీత విభావరులలో ప్రధాన గాయనిగా పాల్గొని అశేష అభిమానులను చూరగొన్నారు.
2014 లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ, సుస్వరాల కోటి గారితో పాటు వంశీ వారి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ప్రయోగాల సంగీత దర్శకులు శ్రీ MS విశ్వనాథన్ సమక్షంలో చెన్నైలో ఆంధ్ర కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొని ఆయన చేతుల మీదగా పురస్కారం స్వీకరించారు.
Her performances have graced the presence of distinguished dignitaries including former Vice President of India M. Venkaiah Naidu, former Telangana Chief Minister K. Chandrashekar Rao, former Maharashtra Governor C. H. Vidyasagar Rao, former Tamil Nadu Governor K. Rosaiah, and former Andhra Pradesh Governor Dr. Tamilisai Soundararajan.
భారత దేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగరరావు గారు, తమిళనాడు గవర్నర్ శ్రీ కే. రోశయ్య గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్యరాజన్ వంటి ప్రముఖుల సమక్షంలో సంగీత విభావరులు చేశారు.
In 2023, she conceptualized and presented the NTR Centenary Musical Tribute, during which actress Jayasudha was honored with the NTR Award. She also presented a grand musical tribute during actor Murali Mohan’s 50-year film career celebrations.
In 2024, she organized the Golden Jubilee Celebrations of renowned director A. Kodandarami Reddy, and in 2025, she organized and presented a full-fledged musical tribute honoring acclaimed filmmaker Pasalapudi Vamsy. She also served as both principal singer and master of ceremonies at the Guntur Medical College Reunion held in Visakhapatnam. She appeared as a featured singer in special episodes of ETV Swarabhishekam.
2023 లో నటరత్న NT రామారావు గారి శత జయంతి సందర్భంగా సహజనటి జయసుధకు NTR పురస్కారం కార్యక్రమం రూపొందించి, ఆ సందర్భంగా సంగీత విభావరి, అలాగే సినీ దిగ్గజం మురళీమోహన్ గారి 50వ చలనచిత్ర వార్షికోత్సవ వేడుకలలో సంగీత విభావరి సమర్పించి ప్రముఖుల మన్ననలు పొందారు.
2024 లో ప్రముఖ దర్శకులు శ్రీ కోదండరామిరెడ్డి గారి స్వర్ణోత్సవ వేడుకలు, 2025 లో దర్శకుడు పసలపూడి వంశీ సినీ ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుకలలో ఆయన్ని ఆహ్వానించి, సత్కరించి అద్భుతమైన పూర్తి స్థాయి సంగీత విభావరిని నిర్వహించారు. వైజాగ్‌లో జరిగిన గుంటూరు మెడికల్ కాలేజీ రీయూనియన్‌లో ప్రధాన గాయనిగా మరియు వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. ఈటీవీ స్వరాభిషేకంలో స్పెషల్ ఎపిసోడ్స్‌లో గాయనిగా పాల్గొన్నారు.
Beyond music, Sarada Akunuri has a profound love for literature. She has actively supported the publication of several important literary works. She received the first copy of Dr. C. Narayana Reddy’s poetry collection “Kshetra Bandham” directly from the poet himself. She played a key role in publishing Malladi Ramakrishna’s Madi Sarada Devi Mandirame, Madilo Veenalu Mroge, and books on Daasarathi.
She published “Nelameedi Jaabili Ningiloni Sirimalle – Akkineni Shata Geetha Lahari,” dedicating its proceeds to the welfare of elderly artists. During the centenary celebrations of music director K. V. Mahadevan, she published “Sarileru Neekevvaru… Mahadevan Animutyalu,” donating its proceeds to support people with disabilities. This book was later selected for libraries across the Telugu states.
సంగీతమే కాకుండా సాహిత్యం మీద కూడా మక్కువ కలిగిన శారద ఆకునూరి గారు పలు పుస్తకాల ప్రచురణకు సహాయ సహకారాలు అందించారు. డా. సి. నారాయణ రెడ్డి గారి “క్షేత్ర బంధం” కవిత సంపుటి మొదటి ప్రతిని ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. మల్లాది రామకృష్ణ గారి “మది శారద దేవి మందిరమే”, “మదిలో వీణలు మ్రోగే”… దాశరధి గారి పుస్తకాలు ప్రచురణలో ప్రధాన భూమిక గా ఉండి మొదటి ప్రతులను అందుకున్నారు.
“నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లె” అక్కినేని శత గీత లహరి పుస్తకాన్ని ప్రచురించి దానిపై వచ్చే ఆదాయం వృద్ధ కళాకారులకు చెందేటట్లు చేశారు. సంగీత దర్శకులు శ్రీ KV మహదేవన్ శతజయంతి సందర్భంగా “సరిలేరు నీకెవ్వరూ..మహదేవన్ ఆణిముత్యాలు” పేరిట పుస్తకాన్ని ప్రచురించి దానిపై వచ్చే ఆదాయం వికలాంగులకు చెందేటట్లు చేశారు. మహదేవన్ గారి మీద పుస్తకం తెలుగు రాష్ట్రాలలో లైబ్రరీలకు ఎంపిక అయినది.
As the principal singer for the Ghantasala Aradhanotsavams and Balu Sangeethotsavams, organized by the Vegesna Foundation across twenty-five American cities to support people with disabilities, she was honored with the “Gana Ratna” Award.
She was conferred the title “America Gana Kokila” by Mr. Upendra Chivukula, Commissioner of the New Jersey Board of Public Utilities, on a public stage. The Pragnika Foundation, Hyderabad, honored her with the title “Gandharva Rasa Varshini.” In January 2026, she received an award during the centenary celebrations of Mandali Krishna Rao, the “Gandhi of Diviseema.”
As a Board Director of the Akkineni Foundation of America, she has played a vital leadership role. Serving as its President in 2019, she initiated numerous philanthropic and commemorative programs celebrating the legacy of Akkineni Nageswara Rao, while honoring distinguished personalities from various fields with prestigious awards.
వికలాంగుల సహాయార్థం వేగేశ్న ఫౌండేషన్ తరపున అమెరికాలో ఇరవై ఐదు నగరాల్లో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలు మరియు బాలు సంగీతోత్సవాల్లో ప్రధాన గాయనిగా పాల్గొని ఆ కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించినందుకు గాను సంస్థ నిర్వాహకులు ఆమెను “గాన రత్న” పురస్కారంతో సత్కరించారు.
న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ శ్రీ ఉపేంద్ర చివుకుల గారు వేదికపై ఆమెకు “అమెరికా గాన కోకిల” బిరుదుతో సత్కరించారు. ప్రాగ్నిక ఫౌండేషన్ హైదరాబాద్ వారు “గాంధర్వ రస వర్షిణి” బిరుదుతో సత్కరించారు. 2026 జనవరిలో దివిసీమ గాంధీ శ్రీ మండలి కృష్ణారావు గారి శతదినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందుకున్నారు.
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికాలో బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషిస్తూ, 2019 కి గాను అధ్యక్షురాలిగా పలురకాలైన ప్రజోపకరమైనటువంటి, నాగేశ్వరరావు గారిని గుర్తుకుతెచ్చే ముఖ్య కార్యక్రమాలను రూపొందించి వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన వారికి పురస్కారాలతో సత్కరించారు.
Mrs. Sarada Akunuri has rendered several memorable film songs on the highly acclaimed television program ETV Swarabhishekam. She also serves in a key creative capacity for ETV’s “Ragam Tanam Pallavi”, contributing significantly to its creative development.
Mrs. Sarada Akunuri successfully organized the first-ever U.S. edition of Paaduta Teeyaga, for the last nine consecutive episodes, earning widespread appreciation for her dedication to music and cultural promotion.
ప్రతిష్ఠాత్మకమైన ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రమంలో పలు సినీగీతాలు ఆలపించారు. ఈటీవీ వారి రాగం తానం పల్లవి కార్యక్రమంలో సృజనాత్మక విభాగంలో గురుతర బాధ్యత పోషిస్తున్నారు.
శ్రీమతి శారద ఆకునూరి అమెరికాలో తొలిసారిగా ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని చివరి తొమ్మిది ఎపిసోడ్లను విజయవంతంగా నిర్వహించి, సంగీతం మరియు సాంస్కృతిక ప్రోత్సాహానికి ఆమె చేసిన కృషికి విశేష ప్రశంసలు పొందారు.
Beyond the stage, she has consistently used her musical talent to support meaningful social causes, performing at numerous fundraising events for organizations including Sankara Nethralaya, Ekal Vidyalaya, Vegesna Foundation, Sankara Eye Foundation, and the Meenakshi Temple, where the efforts were directed toward temple development and the reconstruction of certain structures. She has also actively participated in fundraising initiatives supporting relief efforts for the HUDHUD Cyclone impact, contributing to humanitarian aid and rehabilitation efforts.
Her performances have helped raise awareness and support for initiatives benefiting differently abled individuals, eye care and vision restoration, education for underprivileged children, disaster relief, and broader community welfare programs. Through her music, she has seamlessly combined artistic excellence with a deep commitment to humanitarian and cultural service.
Through her extraordinary journey as a singer, cultural ambassador, organizer, broadcaster, author, and philanthropist, Sarada Akunuri has become a distinguished representative of Telugu music, literature, and culture across the world.
వేదికపై మాత్రమే కాకుండా, ఆమె తన గాన ప్రతిభను అనేక సామాజిక సేవా కార్యక్రమాల కోసం కూడా వినియోగిస్తూ వచ్చారు. ఆమె శంకర నేత్రాలయ, ఏకల్ విద్యాలయ, వేగేశ్న ఫౌండేషన్, శంకర ఐ ఫౌండేషన్, అలాగే మీనాక్షి ఆలయం కోసం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీనాక్షి ఆలయం కోసం జరిగిన కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి మరియు కొన్ని నిర్మాణాల పునర్నిర్మాణానికి నిధులు వినియోగించబడ్డాయి.
అదేవిధంగా, ఆమె HUDHUD తుపాను ప్రభావితుల సహాయార్థం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని, మానవతా సేవా కార్యక్రమాలకు తన వంత సహకారం అందించారు. ఆమె గాన ప్రదర్శనలు దివ్యాంగుల సంక్షేమం, నేత్ర చికిత్సలు మరియు నేత్రదానం, పేద పిల్లల విద్య, విపత్తు సహాయం వంటి అనేక సామాజిక కార్యక్రమాలకు అవగాహన మరియు నిధుల సేకరణకు తోడ్పడ్డాయి.
తన సంగీతం ద్వారా, ఆమె కళాత్మక ప్రతిభను మానవతా సేవా భావంతో మరియు సాంస్కృతిక సేవతో సమన్వయం చేసి ఆదర్శంగా నిలిచారు.